ప్రభాస్ స్థలం వివాదం విషయంలో షాక్ ఇచ్చే తీర్పు ఇచ్చిన హైకోర్టు…!

వాస్తవం సినిమా: తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మాణమైన భవనాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంబంధించిన ఓ ఫాంహౌస్ అక్రమంగా కట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించడంతో వెంటనే ప్రభాస్ కి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా సమయం ఇచ్చి ఖాళీ చేయాలని కూడా సూచించారు. దీంతో వెంటనే ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించి ఆ స్థలాన్ని న్యాయబద్ధంగా అధికారికంగా కొనుగోలు చేసినట్లు న్యాయస్థానంలో ప్రభాస్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వాద‌న‌లు విన్న హైకోర్టు బుధ‌వారం ఆస‌క్తిక‌ర తీర్పుని వెలువ‌రించింది. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌భాస్‌ని గెస్ట్ హౌజ్ నుంచి ఖాళీ చేయించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని తేల్చి చెప్ప‌డంతో ప్ర‌భాస్ షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌భాస్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం వేసిన కేసుపై విచార‌ణ చేసిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆ స్థ‌లం వివాదంలో ఉంద‌ని తేల్చి చెప్పింది. ఈ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకునే విష‌యంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని అధికారుల‌పై అక్షింత‌లు వేసింది.