అమెరికా లోని బీచ్ లో తెలుగు విద్యార్థి గల్లంతు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని బూస్టన్ సమీపంలోని బీచ్ లో తెలుగు విద్యార్థి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి రెడ్డి శ్రావణ్ కుమార్ అనే తెలుగు విద్యార్థి బీచ్ కు వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం బెల్లంపల్లికి చెందిన రెడ్డి శ్రావణ్ కుమార్ అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది.