జెర్సీ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన తారక్..?

వాస్తవం సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సమ్మర్ కానుకగా విడుదలైన జెర్సీ సినిమా విజయం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఏ నలుగురు మధ్య నిన్న చూసిన జెర్సీ సినిమా గురించే అన్నట్టుగా ఈ సినిమా అద్భుతంగా వెండితెరపై తెరకెక్కించాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా చూసిన చాలామంది తెలుగు ప్రేక్షకులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను చూసి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కి అభినందనలు తెలిపారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే జెర్సీ సినిమా స్టోరీని ముందు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తారక్ కి చెప్పాడట అయితే కొన్ని అనివార్య కారణాల వలన తారక్ చేయకపోవడంతో తాజాగా వెండితెర పై గౌతమ్ సెన్సిబిలిటీస్ తారక్ కి నచ్చడంతో వెంటనే డైరెక్టర్ కి ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని ఆఫర్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.