కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ పార్టీ ఫలితాలు…!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల విషయంలో త్వరలో మే 23 వ తారీఖున రాబోతున్న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉన్నారు ప్రధాన పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ లో జరిగిన ఎన్నికల విషయమై జాతీయస్థాయి ఇంటెలిజెన్స్ విభాగాలు కొన్ని అధ్యయనాలు నిర్వహించాయి. తాజాగా కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగాలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ పార్టీ కచ్చితంగా 105 స్థానాలు గెలవడం ఖాయం అని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పలు సర్వేలలో కూడా దాదాపు వైసీపీ వాటి 120 నుండి 130 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ 60 నుండి 70 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ చేసిన సర్వేలో బయటపడ్డాయి. మరి అదేవిధంగా జనసేన పార్టీ విషయానికి వస్తే కనీసం మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఒక ఎంపీ కూడా గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. అయితే పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే వైసీపీ పార్టీ 16 నుండి 19 ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశాలు ఉన్నట్టు టీడీపీ ఆరు స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తం మీద చూసుకుంటే కేంద్ర ఇంటిలిజెన్స్ సర్వేలో కూడా వైసీపీ పార్టీ కి మంచి ఫలితాలు రావడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఎంతగానో ఆనందంతో ఉన్నారు .