స్టేడియంలో మద్యం మత్తులో గ్యాంగ్ రచ్చ రచ్చ.. టీవీ యాంకర్ సహా ఐదుగురి అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతానైట్‌రైడర్స్‌ మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆరుగురు యువతీయువకులు మద్యం తాగి వచ్చారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. పక్కవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఆరుగురు. వారి రచ్చతో గేలరీలో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్‌ను ప్రశాంతంగా చూడలేకపోయారు. పూర్తిగా మైకంలో ఉన్న ఓ టీవీ యాంకర్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.