ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి దీపిక చేస్తుంది ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

వాస్తవం సినిమా: ప్రస్తుతం దీపికా పదుకొనే ‘ఛపాక్’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఢిల్లీలో జరుగుతున్న క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవడంతో ఇటువంటి వాతావరణం నుండి తప్పించుకోవడానికి దీపిక ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదవుతున్న నేపథ్యంలో ఆహారం విషయంలో దీపికా పదుకొనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ సమయంలో బార్లీ తో చేసిన డ్రింక్ మరియు అదే విధంగా డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడానికి బార్లీ షర్బత్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ప్రస్తుతం దీపికా పదుకొనే నటిస్తున్న ‘ఛపాక్’ సినిమాలో ఆమె పాత్ర మేకప్ కోసం ప్రతీరోజు 3 నుంచి 4 గంటల సమయం వెచ్చిస్తున్నారట. ‘ఛపాక్’ సినిమాలో దీపిక యాసిడ్ బాధితురాలి పాత్ర పోషిస్తున్నారు. 2005 ఢిల్లీకి చెందిన లక్ష్మిపై యాసిడ్ దాడి జరిగింది. ఒక యువకుడు ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. ఆ సమయంలో లక్ష్మి వయసు 15 ఏళ్లు. ఈ యాసిడ్ దాడి అనంతరం లక్ష్మి పలు సర్జరీలు చేయించుకున్నారు. 2014లో ఆమె ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డు అందుకున్నారు. ఈ కథను ఆధారం చేసుకుని దీపికా పదుకొనే నటిస్తున్న ఈ సినిమా పై బాలీవుడ్ ఇండస్ట్రీ బీభత్సమైన అంచనాలు ఉన్నాయి.