కన్నడ యంగ్ హీరో పై సీరియస్ అయిన ముఖ్యమంత్రి..!

వాస్తవం సినిమా: కన్నడ హీరో యశ్ పై సీరియస్ అయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంతకీ విషయం ఏమిటంటే మండ్య లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి సుమలత తరఫున మండ్య లో ఆమెకు మద్దతుగా కన్నడ స్టార్ హీరో యశ్ ప్రచారం చేయడం..నామినేషన్ వేసిననాడు ఆమెతో ఉండడం తో సదరు హీరో పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు కన్నడ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే కన్నడ స్టార్ హీరో యశ్ వంటివారు ఇప్పటికీ ఇండస్ట్రీలో బతుకీడుస్తున్నారంటే అది నా వల్లే అంటూ తన దయతోనే ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఇండస్ట్రీలో బతుకుతున్నారని అయితే కుమారస్వామి ఇండస్ట్రీలో ఉన్న వారిపై చాటింగ్ కామెంట్లు చేశారు. ఇంతకీ ఈ సినిమా ఇండస్ట్రీ కి కుమారస్వామి కి సంబంధం ఏమిటి అని డౌట్ వస్తే..గతంలో కుమార్ స్వామి సినీ నిర్మాత. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు గుర్తుచేస్తూ..తనలాంటి నిర్మాతలు సినిమాలు తీయడం వల్ల యశ్ లాంటి హీరోలు బతుకీడుస్తున్నారని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇది ఒకింత అసంబద్ధమైన వాదన అని చెప్పవచ్చు. ఫైనల్ గా తన ప్రచారంలో కుమార స్వామి మాట్లాడుతూ సినిమా హీరోలను నమ్మవద్దని వారు వెండితెరపై చూపించేది అంతా అబద్ధం అని ప్రజలకు తెలియజేశారు.