పోసాని మాటలు విని ఏం చేయలేని పరిస్థితిలో నాగచైతన్య..?

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారిలో ముందుంటాడు సీనియర్ రచయిత పోసాని కృష్ణ మురళి. తాజాగా మజిలీ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న పోసాని కృష్ణమురళి ..హీరో నాగచైతన్య పై చేసిన కామెంట్లు అందరికి షాక్ కి గురి చేశాయి. నాగ చైతన్య ని ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ…మొదటి సినిమా జోష్ లో బొమ్మలా ఉంటే మజిలీలో దాని అమ్మమ్మలా ఉన్నావ్! అంటూ తనదైన శైలిలో పొగిడేశారు. దీంతో వేదిక దగ్గర ఉన్న ఆడియన్స్ మరియు నాగ చైతన్య ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే పోసాని కృష్ణ మురళి తిడుతున్నారా లేక పొగుడుతున్నారా అన్నట్టుగా పెట్టారు…దీంతో పోసాని మాటలకు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా నవ్వేశారు నాగ చైతన్య. ఇదే క్రమంలో పోసాని ఇంకా మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తాగుబోతు పాత్ర చేశాక మిగతా ఏ హీరో చేసిన తాగుబోతు పాత్ర ఎవరికి సెట్ కాలేదని పేర్కొన్నారు. కానీ నాగార్జున తాగుబోతు పాత్రలో తన బాడీకి తగ్గట్టుగా నటించి ఒప్పించాడని సక్సెస్ అయ్యాడని అన్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాలో మజిలీలో నాగచైతన్య కూడా తన తాతగారి లా కాకుండా తండ్రిలా కాకుండా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా తాగుబోతు పాత్రలో అద్భుతంగా నటించాడు అంటూ కితాబిచ్చారు పోసాని. తన శరీరం ఎంత వరకు సహకరిస్తుందో.. అంత పర్ఫెక్ట్ గా లిమిట్ లో చేశాడు అంటూ తనదైన శైలిలో పొగిడేశారు.