మాస్ ఆడియన్స్ ని గట్టిగా టార్గెట్ చేసిన మహేష్ బాబు..!

వాస్తవం సినిమా: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులు ఇప్పటికే భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ‘భరత్ అనే నేను’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు తన కెరియర్ లో 25వ సినిమా గా మహర్షి సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. తాజాగా ఇటీవల టీజర్ విడుదల చేసి అభిమానులను ఎంతగానో అలరించిన మహర్షి సినిమా యూనిట్ ఈ సినిమాకి చెందిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇదే క్రమంలో మహర్షి సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో ఒక ఊర మాస్ సాంగ్ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన ఫోటోలలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే గళ్ళ చొక్కా వేసుకుని మల్లెపూలు పెట్టుకొని పక్కా మాస్ అమ్మాయిల కనిపించడంతో ఇది మాస్ సాంగ్ కోసం పూజా హెగ్డే వేసుకున్న గెటప్ అని మహేష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద మరొకసారి మహేష్ బాబు మాస్ అభిమానులను గట్టిగా తన 25వ సినిమాలో టార్గెట్ చేశారని అంటున్నారు సినిమా విశ్లేషకులు.