రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నట్లు మార్ఫ్ చేసిన ఫోటోలను వర్మ ట్విటర్ లో అప్ లోడ్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని ఫిర్యాదుదారుడు హెచ్చరించారు.