మ్యానిఫెస్టోలలో నగదు పథకాలు వద్దని సుప్రీంలో పిటిషన్

వాస్తవం ప్రతినిధి: దేశంలో దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల కోసం మ్యానిఫెస్టోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యానిఫెస్టోలో నగదు పథకాలు, రుణమాఫీ లాంటి పథకాలను ప్రకటించకూడదని .. ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రీనా సింగ్ అనే న్యాయవాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు నగదు బదిలీ పథకాలపై సూచనలు చేయాలనీ పిటిషన్ లో కోరారు. మరి కోర్టు ఈ పిటిషన్ విచారణకు తీసుకుంటుందా? లేదా అన్నది చూడాల్సిఉంది.