ఉత్తరాదిన భారీ వర్షాలు… 31 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో 16 మంది, గుజరాత్ లో 9 మంది, రాజస్థాన్ లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్, పిలానీ, అజ్మేర్, చిత్తోర్ ఘర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.