తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం..రేపు జరగనున్న పోలింగ్ కోసం సర్వం సిద్ధం

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో హోరా హోరీ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఎన్నికల సంఘం పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది. 6 కోట్ల మంది ఓటర్లు రేపు 18వ తేదీ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీ ఏఐఏడీఎంకే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతుండగా డీఎంకే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తోంది. ఇక మధ్యలో టిటివి దినకరన్ యొక్క ఏఎంఎంకె, కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏఐఏడిఎంకే 39కిగాను 37 స్థానాలు గెలవగా ఈసారి న్ పైచేయి సాధించాలని డిఎంకె భావిస్తోంది.