మొన్నటిదాకా తమ్ముణ్ణి తిట్టాడు..ఇప్పుడు అన్న తో పొగిడించుకున్నాడు..!

వాస్తవం సినిమా: సీనియర్ నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైసిపి పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి తండ్రిగా నటించి కీలక రోల్ పోషించారు పోసాని కృష్ణ మురళి. ఎప్పటినుండో విజయం కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్ కి చిత్రలహరి సినిమా విజయం సాధించడంతో చాలా మంది ప్రముఖుల నుండి అభినందనలు అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ముఖ్యంగా ఈ సినిమాలో ఫెయిల్యూర్లతో పోరాడుతున్న కొడుక్కి అండగా నిలిచి, అతడిని ప్రోత్సహించే పాత్రలో పోసాని గొప్పగా నటించడంతో ఆ పాత్ర వెండితెరపై పండడంతో తండ్రీ కొడుకులుగా పోసాని-తేజుల కెమిస్ట్రీ సినిమాలో బాగా పండింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ‘చిత్రలహరి’ గురించి స్పందిస్తూ పోసాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆయన అద్భుతంగా నటించాడని అన్నారు. మొత్తానికి కొన్ని రోజుల ముందు రాజకీయంగా పవన్‌ను తిట్టి మెగా అభిమానుల్లో వ్యతిరేకత ఎదుర్కొన్న పోసాని.. ఇప్పుడు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తో పొగిడించుకుంటుండం విశేషమే.