మోడీ బయోపిక్ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!

వాస్తవం సినిమా: త్వరలో దేశమంతటా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి సమయంలో మోడీ బయోపిక్ విడుదల అయితే కచ్చితంగా ఓటర్లు ప్రభావితం అవుతాడని జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమా ను ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందిన ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చూసి, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. మోదీ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఎన్నికల సమయంలో ఈ చిత్రం ఓటర్ల మీద ప్రభావం చూపుతుందని పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో, చిత్ర విడుదలను ఈసీ అడ్డుకుంది. దాంతో చిత్ర నిర్మాతలు సురేష్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌, ఆనంద్‌ పండిట్‌, ఆచార్య మనీష్‌, జాఫర్‌ కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘‘ఎన్నికల సంఘం సినిమాను చూసి, తమ అభిప్రాయాన్ని ఈ నెల 19లోపు సీల్డ్‌ కవర్‌లో అందించాలి. ఏప్రిల్‌ 22న తదుపరి విచారణ ఉంటుంది’’ అని పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు తెలిపింది. మొత్తం మీద ఈ సినిమాలో సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో మోడీ బయోపిక్ సినిమా యూనిట్ కి షాక్ ఇచ్చినట్లయింది.