సుమలత కోసం సూపర్ స్టార్ రంగంలోకి..?

వాస్తవం ప్రతినిధి: దక్షిణాదిన బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం మండ్య. అంబరీష్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య నుంచి పోటీలో ఉండటంతో ఆ నియోజకవర్గం ఫలితంపై దక్షిణ భారత దేశం అంతా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంది. తాజాగా సుమలత కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగబోతూ ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఆయన మండ్య నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టనున్నారని – సుమలతను గెలిపించాలని ఆయన పిలుపును ఇస్తూ ప్రచారం నిర్వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంబరీష్ – సుమలత తో ఉన్న సాన్నిహిత్యం మేరకు రజనీకాంత్ ప్రచారానికి రాబోతున్నారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ రజనీకాంత్ ప్రచారం విషయంలో కూడా ఇంకా అధికారిక ప్రకటన లేదు.