నేడు ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో, సంబల్‌పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొంటారు. బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచే మోడీ రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలోనూ, బలోదాబజార్‌ జిల్లాలోని భతాపరాలోని సుమా గ్రామంలోను జరిగే ఎన్నికల సభల్లో మోడీ పాల్గొంటారు.