నేడు గవర్నర్ తో భేటీ కానున్న జగన్

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. పోలింగ్ రోజున పలు చోట్ల హింసాత్మక కార్యకలాపాలుజర వైఎస్సఇగిన సంగతి తెలిసిందే కాగా , ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల మీద జరిగిన దాడి వ్యవహారంలో..ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మీద కూడా కేసులు నమోదు కావడం విశేషం. సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబుతో సహా అనేక మంది నేతలపై కేసులు నమోదయ్యాయి!

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతూ ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని ఆ విషయంలో జేసీ అస్మిత్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని.. ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.

ఈ పరిణామాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనే నెపంతో అనేక మందిపై దాడులు జరిగాయని.. ఈ విషయాలనూ గవర్నర్ కు జగన్ వివరిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.