కేటీఆర్ కు హెల్త్ ప్రాబ్లం

వాస్తవం ప్రతినిధి: కళ్లజోడుతో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్.. తనకు బాంబే ఐస్ (కండ్ల కలక) ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కళ్లకు ఇబ్బందిగా ఉండి వైద్యుల వద్దకు వెళ్లగా.. కండ్ల కలక సోకిందని చెప్పి.. మందులు ఇచ్చారు. మూడు.. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారు. దీంతో.. ఆయన కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండిపోయారు. వైద్యుల సూచన మేరకు తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం నుండి విశ్రాంతి తీసుకొంటున్నారు కేటీఆర్.