ఏపీ ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు ఇవాళ్టి నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

వాస్తవం ప్రతినిధి: ఏపీలో జరిగే ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు ఇవాళ్టి నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సులువుగా చేరుకునేందుకు హాల్‌ టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రాల రూట్‌ మ్యాప్‌లను కూడా ఇవ్వనున్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో రెండు విడతలుగా ఇంజనీరింగ్‌ పరీక్షలు, 23, 24 తేదీల్లో రెండు విడతలుగా వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు నిర్వహించనున్నారు.