పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి:పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. 50శాతం వీవీ ప్యాట్స్ లెక్కించడానికి ఈసీకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. పారదర్శకంగా ఉండే విషయంలో ఈసీకి ఉన్న సమస్య ఏంటని అన్నారు. ఎన్నికల సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎవరైనా పోలింగ్ ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. ఏవో సమాధానాలు చెప్పి ఈసీ తప్పించుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ఈ స్థాయి అవకతవకలతో పోలింగ్ ఎప్పుడూ చూడలేదన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు ఉపసంహరించుకున్నాయన్నారు.