ఒంటిమిట్ట లో ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

వాస్తవం ప్రతినిధి: కడప జిల్లా ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణోత్సవానికి టీటీడీ 2 లక్షల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేస్తోంది. కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కల్యాణ వేదికను టీటీడీ అధికారులు జర్మన్‌ షెడ్లతో సిద్ధం చేశారు. గత ఏడాది కల్యాణోత్సవం సందర్భంగా వర్షానికి కల్యాణ వేదిక దెబ్బతినడంతో ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి జర్మన్‌ షెడ్లతో సిద్ధం చేశారు.