తిరుమలలో పోటెత్తిన భక్త జనం..శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం

వాస్తవం ప్రతినిధి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వైకుంఠం వెలుపల కిలోమీటరు దూరంలో భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,273 మంది భక్తులు దర్శించుకున్నారు.