ఫస్ట్ టైం నాగ చైతన్య ని చూసినప్పుడు సమంత అనుకున్న ఫీలింగ్..!

వాస్తవం సినిమా: పెళ్లైన తర్వాత సమంతా నాగచైతన్య కలిసి నటించిన మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు సమంత నాగ చైతన్య . ముఖ్యంగా సమంత నాగచైతన్య కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్ లో మొదటిసారి సమంత హీరోయిన్ అన్ని ఫోటోలు లో చూశాను అని హీరోయిన్ గా బాగుంటుందని అప్పుడే ఓకే చెప్పాను అంటూ ఇటీవల చైతూ పో ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే క్రమంలో సమంతా కూడా నాగ చైతన్య ని ఫస్ట్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యింది అన్న విషయానికి చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా మారింది. ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ ఫస్ట్ టైం కలిశామని..అప్పటికి ఎవరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో తాను లేనని సమంత చెప్పారు. అంతేకాకుండా అప్పటికే నాకు తెలుగు భాష రాదంటూ..సమంత చెబుతూ కానీ సినిమా సెట్ లో మాత్రం తనకు ఏడు ఎనిమిది పేజీల డైలాగులు ఇచ్చేవారని..సెట్ లోకి రాగానే స్క్రిప్ట్ ను చూస్తూ ఉండిపోయే దానిని.. డైలాగ్ గుర్తుకు వస్తే చేతులు వణికేవన్నారు. చైతూని చూడగానే.. ఫర్లేదు.. అమాయకుడే అనుకున్నానని సమంత చెప్పారు.. ఇప్పటికి అమాయకుడే అంటూ నవ్వేసింది.