ఎన్టీఆర్ కి హీరోయిన్ కోసం నానా తంటాలు పడుతున్న రాజమౌళి..?

వాస్తవం సినిమా: బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చరణ్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమా అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి . ‘RRR’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఇటీవల బ్రేక్ పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాలికి గాయం అవడంతో మూడు వారాలపాటు ఈ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు ఫిలింనగర్ టాక్. ఇదే క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన మొదటిలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని ప్రకటించిన తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుండి ఆమె బయటకు వెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ ఆగిపోకూడదని ఎన్టీఆర్… హీరోయిన్ కోసం నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ హీరోయిన్ ని ఫైనల్ చేయనున్నాడు. కాగా #RRR లో నిత్య మీనన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. అయితే నిత్య మీనన్ ఇందులో సెకండ్ హీరోయిన్ అంట. అలానే ఇప్పటికే ఇందులో ఫైనల్ అయినా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని కూడా ఓ ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు.బాలీవుడ్ హీరోయిన్ అలియా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమా 2020 లో రిలీజ్ జులై నెలలో విడుదల కానుంది.