సాయి ధరంతేజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి..!

వాస్తవం సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలం నుండి సక్సెస్ కోసం ఎదురుచూసి తాజాగా తాను నటించిన ‘చిత్రలహరి’ సినిమాతో అందరిని మెప్పించి మంచి సక్సెస్ అందుకున్నాడు. వేసవి కానుకగా ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సెలవులలో ఉన్న విద్యార్థులు ‘చిత్రలహరి’ సినిమాను చూడటానికి సినిమా హాళ్ల ముందు క్యూ కడుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటన చూసి ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఫిదా అయి తేజు కి కాంప్లిమెంటరీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ నటనకి ముగ్ధుడైనట్లు ఓ వీడియో నీ స్వయంగా విడుదల చేసి సాయి ధరంతేజ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై మరియు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..‘ఈ చిత్రంలో బంధాలు బాంధవ్యాల గురించి, మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా యువతకు.. ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తారసపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషితో ముందుకు వెళ్తే గనుక సాధించలేనిది ఏదీ లే టులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడదగినది ఈ ‘చిత్రలహరి’’ అని చిరంజీవి వీడియోలో వెల్లడించారు.