మహానటిని రజినీకాంత్ పక్కన పెడితే చిరంజీవి ఆదుకున్నారు..?

వాస్తవం సినిమా: మహానటి సినిమా తో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల అందరి చేత మంచి కాంప్లిమెంట్ లు అందుకొంది. మహానటి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనేక అవకాశాలు వస్తాయని భావించిన కీర్తి సురేష్ కి చాలా తక్కువ అవకాశాలే రావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ కి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం చేతి దాక వచ్చి నట్లు వచ్చి పోయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. విషయం ఏమిటంటే తాజాగా రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో ఇప్పటికే రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రజినీకాంత్ పక్కన కీర్తి సురేష్ ను అనుకున్నారంట ముర‌గ‌న్ దాస్‌. రజనీకాంత్ మాత్రం హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయమని చెప్పడంతో దర్శకుడు మురుగదాస్‌కు మరో దారి లేక ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. కీర్తి సురేష్ తనకు జంటగా సెట్‌ అవ్వదని రజనీకాంత్‌ చెప్పారట. కోలీవుడ్‌లో సూపర్‌ చాన్స్‌ను కోల్పోయిన కీర్తీసురేశ్‌కు టాలీవుడ్‌లో మాత్రం మెగా చాన్స్‌ లభించినట్లు తెలుస్తోంది. తాజాగా ఇటీవల కొరటాల శివ తో చిరంజీవి చేయబోయే సినిమాలో కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు రావడంతో మహానటి కీర్తి సురేష్ ని రజినీకాంత్ పక్కన పెడితే చిరంజీవి ఆదుకున్నారని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.