క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

వాస్తవం సినిమా: ‘నాపేరు సూర్య..’ వంటి ఫ్లాప్ తర్వాత చాలా సమయం తీసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గతంలో తన కెరియర్ లో రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈసారి కూడా ఇస్తాడని నమ్మకంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా ఉంటుందని ప్రకటించాక ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకపోవడంతో మెగా అభిమానులు సినిమా ఆగిపోయిందని ఇలా అనేక వార్తలు సోషల్ మీడియాలో రావడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా ఆగిపోయిందని చాలా మంది మెగా అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇంతలా అభిమానులను కన్ఫ్యూజ్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టినట్లు క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కలిసి ఈ సారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని పక్కా స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ అతి తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేయాలని బన్నీ మరియు త్రివిక్రమ్ పక్కా ప్రణాళికతో అంతా సిద్ధం చేసుకున్నట్లు దీనికోసమే ఇప్పటివరకు ఇంత సమయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న సమాచారం.