విజయవాడ ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: విజయవాడలో ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్‌లోని మొదటి ఫ్లోర్‌లో ఉన్న ఒక దుకారణంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు బైటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి.