ఈసీకి సుప్రీం కోర్టు మొట్టికాయ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ చిత్రం విడుదల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎలక్షన్‌ కమిషన్‌ (ఇ.సి.) చిత్రాన్ని చూడకుండానే చిత్ర విడుదలను నిషేధించిందని నిర్మాతలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. చిత్రాన్ని చూసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని ఇ.సి.ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 22వ తేదీనాటికి సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ఇ.సి.ని ఆదేశించింది.