గిరిదీహ్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. జవాన్‌ మృతి, ముగ్గురు మావోయిస్టుల హతం

వాస్తవం ప్రతినిధి: మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య జరిగిన మరోసారి కాల్పులు మోత మోగింది. ఝార్ఖండ్‌లోని గిరిదీహ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టలు హతం కాగా… మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఓ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నికలు సమీపిస్తున్నందున బెల్బాఘాట్‌ ఫారెస్ట్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌ను హతమార్చారు.