రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. బిజెపి ఎంపి మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్‌కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.మీడియాతో, బహిరంగ సభల్లో ప్రధాని మోడీని చౌకీదార్‌ చోర్‌ హై అంటూ రాహుల్‌ అనడంపై లేఖి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు… దీనిపై ఈనెల 22వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆదేశించింది.