కంగ్రాట్స్ జ‌గ‌న్‌: వైసీపీ అధినేత‌కు లేడీ ఫైర్ బ్రాండ్ ఫోన్‌

వాస్తవం ప్రతినిధి: రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌డం క‌ష్టం. అదేవిధంగా ఎప్పుడు ప్ర‌జ‌ల తీర్పు మారు తుందో కూడా ఊహించ‌డం క‌ష్ట‌మే అవుతుంది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ప్ర‌జ‌లు త‌మ తీ ర్పును ఈ వీఎంల‌లో నిక్షిప్తం చేసేశారు. అయితే, ఫ‌లితాలు వ‌చ్చేందుకు 40 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో రాష్ట్రంలో తీ వ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఎవ‌రు గెలుస్తారు? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న చుట్టూ.. చ‌ర్చ‌లు సాగుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశాం కాబ‌ట్టి.. ప‌సుపు-కుంకుమ ఇచ్చాం కాబ‌ట్టి తామే గెలుస్తామ‌ని చంద్ర‌బాబు, ఇసుక మాఫియా, మ‌ట్టి మాఫి యా, కాల్ మ‌నీ నేరాలు, దోచుకో దాచుకో సిద్ధాంతాలు వంటివి అమ‌లు, అవినీతి వంటి కారణంగా వెల్లువెత్తిన ప్ర‌జావ్య‌తి రేక‌త‌లో తామే గెలుస్తామ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

మొత్తానికి ఈ ప‌రిణామం చాలా ఆస‌క్తిగా మారింది., అయితే, రాష్ట్రంలో పెరిగిన పోలింగ్‌, క్యూల వ‌ద్ద బారులు తీరిన ప్ర‌జ‌ల ను గ‌మ‌నిస్తే.. ఏదో మార్పు దిశ‌గానే రాష్ట్రం ముంద‌డుగు వేస్తోంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అధికారంలోకి వ‌చ్చే పార్టీ ఏది అని అంటే.. మేధావుల నుంచి ప‌రిశీల‌కులు, విశ్లేష‌కుల వ‌ర‌కు కూడా అంద‌రి వేళ్లూ వైసీపీవైపు చూపిస్తున్నా యి. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఏపీ ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ స‌ర్వే నివేదిక‌లోనూ జ‌గ‌న్‌కే మంచి మార్కులు ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఈ క్రమం  లోనే జ‌గ‌న్ గెలుపును త‌క్కువ చేసి చూపించేందుకు లేదా ఎన్నిక‌ల సంఘం చేసిన పొర‌పాట్ల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ గెలిచాడ‌ని, ప్ర‌జ‌లు ఆయ‌న‌ను తిర‌స్క‌రించార‌ని ప్ర‌చారం చేసుకునేందుకు చంద్ర‌బాబు శ‌త‌థా శ్ర‌మిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర‌స్థాయిలో పోరాటానికి సైతం దిగారు. ఈవీఎంలు మోసం చేశాయ‌ని 680 పైచిలుకు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే, బాబు వైఖ‌రి ఇలా ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే జ‌గ‌న్ గెలుస్తాడ‌ని వెల్ల‌డించారు. ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌ర్వే నివేదిక త‌మ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. స‌రే.. ఈయ‌న‌కు చంద్ర‌బాబుకు ప‌డ‌దు కాబ‌ట్టి ఇలా చెప్పి ఉంటార‌ని అనుకుందాం. అయితే, అనూహ్యంగా ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ప‌శ్చిమ బెంగాల్ సీఎం,లేడీ ఫైర్ బ్రాండ్ మ‌మ‌తా బెన‌ర్జీ తాజాగా జ‌గ‌న్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి మ‌మ‌తా బెన‌ర్జీ.. పొలిటిక‌ల్‌గా చంద్ర‌బాబుకు బెస్ట్ ఫ్రెండ్‌, ఆయ‌న మ‌ద్ద‌తు దారు. అంతేకాదు, విశాఖ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా హాజ‌రై చంద్ర‌బాబుకు ఓటేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. మ‌రి అంత‌గా చంద్ర‌బాబు గూటి ప‌క్షిగా మారిన మ‌మ‌త‌.. ఇప్పుడు స్వ‌యంగా జ‌గ‌న్‌కు ఫోన్ చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతోంది. జ‌గ‌న్‌కు ఫోన్ ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేస్తున్న యాగీ ఏమేర‌కు ఆయ‌న ప‌రాజ‌యాన్ని ఆపుతుందో చూడాలి.