దేవేగౌడ రుణాన్ని తీర్చుకుంటున్న చంద్రబాబు!

వాస్తవం ప్రతినిధి: ఇటీవలే మాజీ ప్రధాని దేవేగౌడ ఏపీకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే కాగా అందుకు ప్రతిగా చంద్రబాబు నేడు మండ్య వెళ్లారు. అక్కడ దేవేగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా దేవెగౌడ రుణాన్ని తీర్చుకొంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు.

మరోవైపు మండ్యలో విజయాన్ని జేడీఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుమారస్వామి సీఎం సీట్లో ఉండటంతో అక్కడ నిఖిల్ గెలవకపోతే అంతే సంగతులు. అందుకే చంద్రబాబును కూడా అక్కడకు తీసుకెళ్లి జేడీఎస్ ప్రచారం చేయించుకొంటూ ఉంది.