భద్రాద్రిలో నేడు ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

వాస్తవం ప్రతినిధి: భద్రాద్రిలో వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 10.30 గంటలకు మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు శ్రీరాముడి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.