నా ఆరోగ్యం బాగుపడింది.. ఎవరూ కంగారుపడవద్దు: దలైలామా

వాస్తవం ప్రతినిధి: తన ఆరోగ్యం బాగుపడిందని, ఎవరూ కంగారుపడవద్దని తన అనుయాయులకు బౌద్ధ మతానికి చెందిన ఆధ్యాత్మికవేత్త దలైలామా చెప్పారు. తీవ్ర అనారోగ్యానికి గురైన దలైలామాను న్యూఢిల్లిలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తరువాత ఆరోగ్యం కుదుటపడటంతో దలైలామాను ఆసుపత్రినుంచి శుక్రవారం డిశ్చార్జి చేశారు. తనకు ఒక రకమైన ఫ్లూ సోకిందని, ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు చేసిన తరువాత ఆయనకు ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారని దలైలామా చెప్పారు.