భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తి కి జీవిత‌కాల శిక్ష‌ విధించిన కాలిఫోర్నియా కోర్టు

వాస్తవం ప్రతినిధి: 41 ఏళ్ల భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తి అమెరికాలో ఓ మైన‌ర్‌ అమ్మాయిని లైంగికంగా వేధించాడని కాలిఫోర్నియా కోర్టు జీవిత‌కాల శిక్ష‌ను విధించింది. వివరాల ప్రకారం..కాలిఫోర్నియాలోని దీప‌క్ దేశ్‌పాండే అనే వ్య‌క్తి .. ఫ్లోరిడాకు చెందిన ఓ అమ్మాయితో 2017లో ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా స‌న్నిహితుడ‌య్యాడు. మోడ‌లింగ్ ఫోటోగ్రాఫ‌ర్‌ను అంటూ ఆమె న‌గ్న చిత్రాల‌ను సేక‌రించాడు. ఆమెను వ‌శ‌ప‌రుచుకునేందుకు త‌రుచూ ఫ్లోరిడాలోని ఒర్లాండో వెళ్లేవాడు. ఆ అమ్మాయిపై ప‌దేప‌దే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌ర్వాత పోర్న్ వీడియోలు పంపాలంటూ వేధించాడు. అయితే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఓ అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ ద్వారా దేశ్‌పాండే అకృత్యాల‌ను ప‌సిక‌ట్టారు. పోలీసుల‌కు చిక్కిన త‌ర్వాత ఆ అమ్మాయిని చంపేందుకు దేశ్‌పాండే ప్లాన్ కూడా వేశాడని, కానీ అది కుదరలేదని.. చివ‌ర‌కు కాలిఫోర్నియా జిల్లా కోర్టు జ‌డ్జి కార్లో మెండోజా ఈ కేసులో తీర్పును వినిపించారు. లైంగికంగా ప్రేరేపించినందుకు జీవిత‌కాల శిక్ష‌, చైల్డ్ పోర్న్ కేసులో మ‌రో 30 ఏళ్ల అద‌న‌పు శిక్ష‌ను కోర్టు ఖ‌రారు చేసింది.