సచిన్‌పై పాకిస్థాన్‌ క్రికెటర్‌ ప్రశంసలు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షాజాద్‌.. మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్   పై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మనే అని కితాబిచ్చాడు. షాజాద్‌ తన అభిమానులకు ట్విటర్‌ వేదికగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సచిన్‌ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌, ఆదర్శప్రాయుడు, అన్నింటికంటే అత్యుత్తమ మానవత్వం ఉన్న వ్యక్తి.. అందరినీ ఒకేలా గౌరవిస్తారు’ అని పేర్కొన్నాడు.