చిత్రలహరి రివ్యూ !

రేటింగ్: 2.5/5 

చిత్రం : ‘చిత్రలహరి’

నటీనటులు: సాయి తేజ్ – కళ్యాణి ప్రియదర్శిని – నివేథ పేతురాజ్ – పోసాని కృష్ణమురళి – సునీల్ -వెన్నెల కిషోర్ – బ్రహ్మాజీ – భరత్ – సుదర్శన్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: నవీన్ ఎర్నేని – రవిశంకర్ యలమంచిలి – మోహన్ చెరుకూరి
రచన – దర్శకత్వం: కిషోర్ తిరుమల

వాస్తవం సినిమా: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నివేత పెతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ కలిసి జంటగా నటించిన చిత్రం ” చిత్ర లహరి “. “నేను శైలజ” ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఢీలా పడిన ధరమ్ తేజ్ ఈ సినిమా పైన చాలానే ఆశలు పెట్టుకున్నాడు. అతని ఆశలు అంచనాలను అందుకున్నాయా లేక అడియాశలు అయ్యాయా అన్నది చూద్దాం.

చిత్ర లహరి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఒక మనిషి తనపై తాను నమ్మకముంచాలి అని బోధన చేసే ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల యువతకు రీచ్ అయ్యేలా బాగానే తీశాడు కానీ ఒక సగటు సినిమా దర్శకుడిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

మొదటి భాగం :- ఒక కోర్టు సీనుతో ప్రారంభమయ్యే ఈ సినిమా, ముందుగా సాయి ధరమ్ తేజ్ నిందితుడిగా కనపడతాడు, తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అతని జీవితంలో ఎప్పుడూ ఎదురొచ్చే ఓటమి గురించి చెప్తాడు. తరువాత హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ, వారిద్దరి మధ్య లవ్, చివరికి ఇంటర్వెల్ కు బ్రేక్ అప్ వెంటవెంటనే జరిగిపోతాయి, ఎప్పటిలాగే.

మొదటి భాగం రిపోర్టు :- ఇలా మొదటి భాగం పర్వాలేదనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ బాగా మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అతని పర్ఫామెన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది.

రెండవ భాగం :- గ్లాస్ మేట్ సాంగ్ చాలా బాగా చిత్రీకరించారు. సాయి ధరమ్ కొన్ని మంచి స్టెప్పులు వేశాడు. పోసాని, సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే తండ్రి – కొడుకుల సెంటిమెంట్ బాగానే వర్క్ ఔట్ అయింది. కానీ స్టోరీ ముంబయికి వెళ్ళిన తరువాత సినిమా ఢీలా పడింది. వెన్నెల కిషోర్ పాత్ర క్లైమాక్స్ కి బాగానే ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి. చివరికి ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ తో కథ ముగిసిపోతుంది.

ఫైనల్ రిపోర్టు :- సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు కిషోర్ తిరుమల. పోసాని కూడా చాలా బాగా పఫార్మ్ చేశాడు. సునీల్, వెన్నెల కిషోర్ వల్ల చిత్రంలో కొన్ని నవ్వులు వెలువడ్డాయి. కానీ హీరోయిన్ తో సహా మిగతా క్యారెక్టర్లు అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దేవి శ్రీ బాణీలు రిపీట్ మోడ్ లో వినొచ్చు. మొత్తానికి “చిత్ర లహరి” సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో అతను ఆశించిన బ్రేక్ ఇచ్చే సినిమా అయితే కాదు గానీ పర్వాలేదనిపించే మరొక సినిమా.