అక్రమంగా తరలిస్తున్న రూ. 1.90 కోట్ల నగదు స్వాధీనం

వాస్తవం ప్రతినిధి: కృష్ణ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీలో ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న 1.90 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిమెంట్‌ మధ్య నగదు పెట్టి ఏలూరుకు తరలిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. నగదు తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్‌ చేశారు.