కొరటాల సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో జోడి కట్టబోతున్న చిరంజీవి..?

వాస్తవం సినిమా: డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా గత కొంత కాలం నుండి చేస్తున్నారు చిరంజీవి. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు నయనతార ఇంకా చాలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్లాప్ లేకుండా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు చిరంజీవి. ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసిన కొరటాల శివ హీరోయిన్ల ను కూడా సెలెక్ట్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. సోషల్ డ్రామాగా తెరకెక్కనున్న..ఈ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి వెళుతున్నట్లు టాక్. గతంలో ఈ సినిమా కోసం…చాలా మంది తెలుగు హీరోయిన్లను అనుకున్నారు కొరటాల శివ వారీలో అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. దీనికి సంబంధించిన ఎలాంటీ అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన ఆధరణ, క్రేజ్‌తో… ఇప్పుడు కీర్తి.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కిర్తీ సురేష్‌తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌‌కు అవకాశం ఉందని..ఆ పాత్ర కోసం.. శృతి హాసన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మొత్తమ్మీద చూసుకుంటే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది.