జమ్ములో మరో ఘాతుకం..ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు చంద్రకాంత్‌ సింగ్‌ పై ఉగ్రదాడి

వాస్తవం ప్రతినిధి: జమ్ములో మరో ఉగ్ర ఘాతుకం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు చంద్రకాంత్‌ సింగ్‌, ఆయన వ్యక్తిగత భద్రత గార్డును ఓ ఉగ్రవాది కాల్చిచంపాడు. కిష్త్వార్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న చంద్రకాంత్‌పై ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఆయనతోపాటు పక్కనే ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి రాజిందర్‌ను కాల్చిచంపాడు మత పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.