ఆ ఒక్క “ప్రకటన”… లోకేష్ ని ఓడిస్తుందా..???

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలందరూ తమ తమ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా , ఉత్కంఠ గా ఎదురుచూస్తున్న ఏకైక విషయం ఏమిటంటే. మంగళగిరి లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విజయం సాధిస్తారా..?? లేదా..?? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఎందుకంటే…

వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంధించిన ఓ బ్రహ్మస్తమే అందుకు కారణం అంటున్నారు. ఇంతకీ ఆళ్ళ సంధించిన ఆ బ్రహ్మస్త్రం ఏమిటంటే. లోకేష్ ప్రస్తుతం పోటీ చేస్తున్న మంగళగిరిలో గతం నుంచి టీడీపీ తరుపున టిక్కెట్ ఆశిస్తూ, ఎంతో కష్టపడి పనిచేసిన ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ కాండ్రు కమల ఆ స్థానం నుంచి టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇన్చార్జిగా ఉన్న ఆమెను తప్పించి చంద్రబాబు లోకేష్ కు కట్టబెట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోన్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో

వైసీపీ అభ్యర్థి అయిన ఆళ్ళ కి ఆమె మద్దతు పలుకుతూ సంచలనం సృష్టించారు. మంగళగిరిలో అత్యధికంగా చేనేత కుటుంబాలు ఉంటాయి. అక్కడి అభ్యర్దిల గెలుపుని డిసైడ్ చేసేది కూడా చేనేత వర్గం వారే కావడం విశేషం. అయితే కాండ్రు కమల చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు బీసీల మద్దతు పూర్తిస్తాయిగా ఆమెకి మొదటి నుంచీ వస్తూఉంది. అయితే ఒక్క సారిగా ఆమె టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. కానీ

ఎలాగైనా సరే తన తనయుడిని మంగళగిరి నుంచీ గెలిపించుకోవాలని డిసైడ్ అయిన చంద్రబాబు డబ్బుని భారీ స్థాయిలో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు కూడా. అయినా చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు అయినా చేయడంలో ఆరితేరిన వ్యక్తని గ్రహించిన ఆళ్ళ తిరుగులేని బ్రహ్మస్తాన్ని ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తనని భారీ మెజారిటీతో గెలిపించాలని, అలా గెలిపించిన మీకు కృతజ్ఞతగా

 

2024 ఎన్నికల్లో అశేషంగా ఉన్న చేనేత వర్గానికి ఈ నియోజకవర్గ సీటును అప్పగిస్తానని, ఈ స్థానం నుంచీ నేను పోటీ చేయనని, ఇప్పటికే ఈ విషయంపై అధినేత జగన్ కి వివరించి చెప్పి ఒప్పించి మీకు మాట ఇస్తున్నానని ఆయన అన్నారు. ఈ ఒక్క ప్రకటనతో టీడీపీ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రకటన చేనేత వర్గాలని, బీసీలని ఎంతగానో ఆకర్షించిందని తెలుస్తోంది. దాంతో లోకేష్ బాబుకు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులని అయినా సరే ఎదుర్కునే చంద్రబాబు కి ఈ విషయాన్ని దాటుకుని వెళ్ళడం పెద్ద కష్టం కాదని, లోకేష్ గెలుపు మంగళగిరిలో బంపర్ మెజారిటీతో ఉంటుందని సవాల్ విసురుతున్నారు టీడీపీ నేతలు. చూద్దాం మంగళగిరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో.