సీఎం కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడీయాతో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మరోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలని , అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ద్వారా చరిత్రలో తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చంద్రబాబు గారితో చెప్పినట్లు ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.