‘మహర్షి’ సినిమా టీజర్ పై ఆడియన్స్ టాక్..!

వాస్తవం సినిమా:  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా మహేష్ కెరీర్లో 25వ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియా లో విడుదల అయ్యి చాలా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల ఉగాది పండుగ పర్వదినాన విడుదల చేశారు సినిమా యూనిట్. దీంతో విడుదలైన మహర్షి సినిమా టీజర్ ని చూసి యాజ్ ఇట్ ఇస్ శ్రీమంతుడు సినిమా టైపు తీశారు అని అంటున్నారు మహేష్ అభిమానులు నెటిజన్లు. ముఖ్యంగా ఫైట్ సీన్ విషయంలో శ్రీమంతుడు సినిమా లో మామిడి తోట లో ఉన్న ఫైట్ లాగానే మహర్షి సినిమాలో టీజర్ లో చూపించిన పైట ఉందని అంటున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులు బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో సినిమాలో ఉన్న మీడియా సన్నివేశం కూడా భరత్ అనే నేను సినిమాలో ఉన్న సన్నివేశం లాగానే ఉందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అని అంటున్నారు ఆడియెన్స్. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజా హెగ్డే వేస్ట్ ప్రక్కన హీరోయిన్ గా నటిస్తోంది.