జనం అద్దెకు దొరుకును….

బహిరంగసభలకు..బలప్రదర్శనకు..సమావేశాలకు..ఊరేగింపులకు..పార్టీ ప్రచారాలకు…. 
వాస్తవం ప్రతినిధి:  ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వేటికైనా సరే తగు సమయంలో చెబితే మీకు కావలసినంత మందిని ఏర్పాటు చేయబడును .మహిళలకు 150నుండి 200రూపాయలు, పురుషులకు 200 నుండి 300 రూపాయలు.(ఒక క్వార్టర్ మందు)ఇవ్వవలెను .ముఖ్య గమనిక డిమాండ్ ను బట్టి రేటు నిర్ణయించబడును .అన్నీ రాజకీయ పార్టీలు ఒకేసారి ఒకే సమయంలో సభలు ,సమావేశాలు ,ర్యాలీ లు,ఎవరు రేటు పెంచితే వారికే ఎక్కువ ప్రాధాన్యం. మాది సీజన్ బిజినెస్ ..ఈ సీజన్ పోతే మళ్ళీ సీజన్ వరకు మమ్ములను ఎవ్వరూ పట్టించుకోరు .పార్టీ ల మీద అభిమానం తో జనం మానేశారు అందువలన మీరు (నాయకులు)మాలాంటి బ్రోకర్ల ను సంప్రదించక తప్పదు.ప్రస్తుతం రాజకీయ పార్టీల సభలు, ర్యాలీ లు మరీ ఎక్కువైపోతున్నాయి.. వాటిలో ఆయా ప్రాంతాల నాయకులు వారి మీద ,పార్టీ లమీద అభిమానం జనానికి ఏనాడో చచ్చిపోయింది. ఎందుకంటే నాయకులు ప్రజలకి ఉపయోగపడింది శూన్యం. అందువలన జనం సభలకు, ప్రచారాలకు రావడం మానేశారు ..అది మా పాలిట వరంగా మారింది. అందుకే మేము ఈ వ్యాపారం ఎన్నుకున్నాం ..ఈ సీజన్ లో మా కుటుంబాలు ,మేము జల్సా గా బ్రతికేస్తాం ..

గమనిక..మాకు (బ్రోకర్లకు) ప్రత్యేక వసతులు కల్పించాలి. లేదంటే మీ తదుపరి కార్యక్రమా లకు మేము తగిన బుద్ది చెప్పగలం…..

                                                                                         సంప్రదించవలసిన చిరునామా….                                                                                           మీకు ఎరుకైన అడ్రస్సే..                                                                                                       (ఇది వార్త మాత్రమే)

                                                   .