భారతదేశానికి MH- 60R రెమో సీహక్ హెలికాప్టర్ల అమ్మకానికి అమెరికా అంగీకారం

వాస్తవం ప్రతినిధి:  అమెరికా, భారతదేశానికి తమ రక్షణ ఒప్పందంలో భాగంగా MH- 60R రెమో సీహక్ రకానిని చెందిన 24 హెలికాప్టర్లను అమ్మడానికి ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ లాక్ హీడ్ మార్టిన్ సంస్థ అభివృద్ధి పరచిన ఈ హెలికాప్టర్లు బహుముఖంగా ఉపయోగపడతాయి. సబ్ మెరైన్ల మీద దాడికి, సముద్రం పైనుండి దాడి చేసే యుద్ద నౌకల మీద దాడికి ఇంకా అనేక రిస్క్ ఆపరేషన్స్ లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఒప్పదం విలువ 2.6 బిలియన్ డాలర్లు కాగా ఇందులో భాగంగా ఇకా 10 హేలిఫైర్ మిస్సైల్స్, 38 అధునాతన మారణాయుధాలు, సిస్టం రాకెట్స్ మరియు ఇతర ఆయుధాలు ఇస్తారు.