ఈ రోజు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో వౖౖెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు సత్తెనపల్లి, ఉదయం 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ఒంగోలులో జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మైలవరంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగించనున్నారు.