ఏపీలో కాక పుట్టిస్తున్న “కేకే” సర్వే..!!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వివిధ సర్వే ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుంది, ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు, కేంద్రంలో చక్రం తిప్పగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది అంటూ పలు రకాలుగా సర్వేలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటిదాకా జాతీయ మీడియాలన్నీ చేసిన సర్వేలు ఒకెత్తయితే తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కేకే సర్వే ఏపీలో రాజకీయ పార్టీలకు కాక పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎంతో పాపులర్ అయిన కేకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రంగం నుంచి సర్వే రంగంలోకి అడుగుపెట్టానని చెబుతుంటారు. కేకే సర్వే లెక్కల ప్రకారం

ఏపీలో లో ఉన్న వైసీపీ, జనసేన ,టిడిపి పార్టీలలో లో ఎవరికి అత్యధిక ఎంపీ స్థానాలు దక్కుతాయని సర్వే నిర్వహించారు కేకే . మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 15 ఎంపి స్థానాలు పైనే సర్వే నిర్వహించారు. అయితే తాను నిర్వహించిన సర్వేలో వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే ఈ 15 ఎంపీ స్థానాలలో వైసిపి విజయ ఖాయమని అంటున్నారు. ఒకవేళ కొంచెం అటూ ఇటూ అయినా నా దాదాపు 12 స్థానాల వరకు కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని కేకే ధీమాగా చెప్పారు

ఇదిలాఉంటే 15 లో 12 పక్కా గెలిస్తే మిగిలిన రెండు స్థానాలలో వైసిపి గట్టిగా పోటీ పడుతుందట ఒక స్థానంలో టిడిపి మరొక స్థానంలో జనసేన వైసిపికి గట్టిపోటీని ఇస్తున్నారట ఇంతకీ కేకే సర్వే ప్రకారం వైసీపీ గెలిచే స్థానాలను ఒకసారి పరిశీలిస్తే

1) విజయనగరం

2) అరకు కు

3) అనకాపల్లి

4) విశాఖపట్నం

5) కాకినాడ

6) రాజమండ్రి

7) ఏలూరు

8) గుంటూరు

9) నరసరావుపేట

10) బాపట్ల

11) ఒంగోలు

12) అనంతపురం

13) హిందూపురం