చంద్రబాబు వ్యూహం… జగన్ ని సీఎం చేస్తుందా…???

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని , ప్రతిపక్ష నేత జగన్ ని అదే హోదాలో కూర్చోబెట్టాలని నిర్విరామంగా కష్టపడుతున్నారు. అందుకుగాను చంద్రబాబు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులాల వారీగా మతాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు ఇందుకుగాను జాతీయ స్థాయి నాయకులను ఎన్నికల ప్రచారానికి దింపుతూ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ కష్టపడనంతటి స్థాయిలో కష్టపడుతూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే…

ఎన్నికల ముందు పింఛన్, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ మొదలైన పథకాలు అమలు చేస్తూ ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మోదీ జగన్ కెసిఆర్ కలిసి ఏపీ పై కుట్రలు చేస్తున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు. వివేకానంద రెడ్డి హత్య జగనే చేయించాడనే ఆరోపణలతో జగన్ పై ప్రజలలో అభద్రతా భావం కలిగించేలా తమ నేతలతో వ్యాఖ్యలు కూడా చేయించారు చంద్రబాబు. అయితే ఇవన్నీ చాలవన్నట్టు ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులను ఏపీకి తీసుకువస్తున్నారట బాబు.

బాబు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ముస్లిం ఓట్లు అధికంగా ఉండే కడప జిల్లా కర్నూలులో ప్రచారం చేయించారు. ఆయనే కాకుండా మరి కొంతమంది నాయకులు కూడా రంగంలోకి దింపేందుకు బాబు సిద్ధమవుతున్నారట. ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తో విజయవాడ విశాఖపట్నం లో ప్రచారం చేయించాలని, అలాగే అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవులతో ప్రచారం చేయించి ఏపీలో యాదవుల ఓట్లు ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారట. మమతా బెనర్జీ ని సైతం తీసుకువచ్చి విశాఖపట్నంలో ప్రచారం చేయించాలని అలాగే కర్ణాటక నుంచి దేవగౌడ ని ప్రచారంలోకి తీసుకు రావాలని బాబు వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే జగన్ మాత్రం బాబు ఇదే అంశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని చూస్తున్నారు. బాబుకు అనుకూలంగా జాతీయ నేతలంతా ప్రచారానికి వస్తే, ఒకే ఒక్క జగన్ ని ఎదుర్కోవడానికి ఎంతో మంది ముప్పేట దాడి చేస్తున్నారు , కానీ జగన్ తన తండ్రిలా ఒంటరి పోరు చేస్తున్నారు అంటూ ఇదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లి లాభపడాలని వైసీపీ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే జగన్ పై మరింత సానుభూతి పెరిగి వైసీపీ లాభపడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.